close

తాజా వార్తలు

ఎన్నికలైపోతే పాలన ఆగిపోవాలా?: గోరంట్ల 

రాజమహేంద్రవరం: ఎన్నికలు అయ్యాక రాష్ట్రంలో 43 రోజుల పాటు పాలన ఆగిపోవాలా అని తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చియ్య చౌదరి ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపద్ధర్మం కాదని.. జూన్ వరకు పనిచేసే హక్కు ఉందన్నారు. సీఎం సమీక్షలు నిర్వహించడంపై వైకాపా నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఆయన రాజమహేంద్రవరంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రధాని మోదీ ఏజెంట్‌లా మారారని గోరంట్ల ఎద్దేవాచేశారు. న్యాయ వ్యవస్థను కూడా మోదీ భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు. మోదీ కుట్రలో ఇరుక్కున్న జస్టిస్‌ తరుణ్ గొగొయ్‌కు మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల సంఘం సభ్యుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన 36 ఏళ్ల అనుభవంతో చెబుతున్నానని, రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని  ధీమా వ్యక్తం చేశారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net