close

తాజా వార్తలు

చొక్కా పట్టుకోండి..నలుగురిలో నిలదీయండి  

మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌

భోపాల్‌: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమలనాథ్‌ కుమారుడు నకుల్‌ నాథ్‌ తొలిసారిగా బరిలోకి దిగుతున్నారు. దీంతో కుమారుడికి మద్ధతుగా కమల్‌ నాథ్‌ ప్రచారంలో పాల్గొన్నారు. నకుల్‌ చింద్వాడా నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా  కమల్‌ నాథ్‌ మాట్లాడుతూ..‘ చింద్వాడాతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. చరిత్ర సృష్టించడానికి మీ ముందుకు వస్తున్నాం. నా కొడుకుని ఆశీర్వదించండి. నకుల్కు నేను కొన్ని బాధ్యతలు అప్పగించాను. మీకు(ప్రజలకు) ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అతడిని నలుగురిలో నిలదీయండి. చొక్కా పట్టుకోండి. నా కొడుకని ఆలోచించకండి. ప్రజలకిచ్చిన మాట తప్పితే వారిని మోసం చేసినట్లే.  మోసాలకు,జిమ్మిక్కులకు మేం దూరం. అలాంటి నేతలను ప్రోత్సహించం. ప్రజలను తప్పుదారి పట్టించే వారికి చరిత్ర ఉండదు’అని అన్నారు.
 కమల్‌ నాథ్‌ చింద్వాడా లోక్‌ సభ స్థానం నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడాయన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆ స్థానాన్ని ఆయన కొడుకు నకుల్‌కి కేటాయించారు. ఏప్రిల్‌ 29న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net