close

తాజా వార్తలు

పొత్తుకు సిద్ధం.. కానీ: నవీన్‌ పట్నాయక్‌ 

భువనేశ్వర్‌: లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏదైనా ఓ రాజకీయ పార్టీతో లేదా కూటమితో తాము పొత్తుకు తాము సిద్ధమేమని ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ నేత నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు. అయితే, తాము మద్దతు ఇవ్వాలంటే ఒడిశా అభివృద్ధి, సంక్షేమం కోసం తమ డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంటుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘అన్ని పార్టీల భావజావాలు ప్రజాస్వామ్యానికి మద్దతు తెలుపుతూనే ఉంటాయి. ఒడిశా ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే పొత్తు పెట్టుకుంటాం. ఫలితాలు ఎలా వస్తాయో చూద్దాం.. ఏయే పార్టీలు ఎన్నెన్ని సీట్లు గెలుచుకుంటాయో చూడాలి’ అని వ్యాఖ్యానించారు. 

‘భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్‌కి బీజేడీ సమాన దూరం పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో పని చేయాలన్న లక్ష్యాలు నాకు లేవు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ప్రతి ఎన్నికల్లో మా సీట్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులను చేశాం. ఒడిశా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం’ అని నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు. కాగా, ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net