close

తాజా వార్తలు

మూడో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం..

ఇంటర్నెట్‌డెస్క్‌: లోక్‌సభ మూడోదశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 14 రాష్ట్రాల్లో మొత్తం 116 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. గుజరాత్‌లో 26, కేరళలో 20, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 14, ఉత్తర్‌ప్రదేశ్‌లో 10, ఛత్తీస్‌గఢ్‌లో 7, ఒడిశాలో 6, పశ్చిమబెంగాల్‌లో 5, బిహార్‌లో 5, అసోంలో 4, గోవాలో 2, దాద్రానగర్‌ హవేలిలో 1, దమన్‌లో 1,  జమ్మూకశ్మీర్‌లో 1 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ద్వారా ఆయా నియోజక వర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పోటీ చేస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ నిలిచిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ ‌పవార్‌ కూతురు సుప్రియాసూలే పోటీ చేస్తున్న మహారాష్ట్రలో బారామతి, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే పోటీలో ఉన్న కర్ణాటకలోని కలబురిగి స్థానాలకు మూడో దశలోనే ఎన్నికలు జరుగుతాయి. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net