close

తాజా వార్తలు

దిల్లీ దక్షిణ నుంచి బరిలో విజేందర్‌ సింగ్!

దిల్లీ: పంచ్‌ల వీరుడు, బీజింగ్ ఒలింపిక్  పతక విజేత విజేందర్‌ సింగ్‌ను దిల్లీ దక్షిణ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ బరిలో దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్ఠానం త్వరలో ప్రకటన చేస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే దిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజక వర్గాల్లో ఆరింటికి పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కానీ దిల్లీ దక్షిణ లో పోటీ పడే అభ్యర్థి పేరు మాత్రం ప్రకటించలేదు.

‘ఆయన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖరారు చేయనున్నారు. ఆయన ఆ స్థానంలో విజయం సాధించగలరు’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ‘మేం ఆ స్థానానికి ఒక సెలబ్రిటీని బరిలోకి దింపాలనుకున్నాం. అదేవిధంగా అతడు ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తి అయ్యుండాలని భావించాం’ అని ఆయన తెలిపారు. హరియాణా పక్కనే ఉండే ఈ నియోజకవర్గంలో ఉన్న జాతవ్‌లు, గుజ్జర్ల ఓటర్లను సింగ్ కొల్లగొడతారని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. అక్కడి ప్రస్తుత ఎంపీ భాజపాకు చెందినవారు. అంతేకాకుండా దిల్లీ లోక్‌సభ స్థానం నుంచి రెజ్లర్ సుశీల్ కుమార్‌ను బరిలో దింపాలని కాంగ్రెస్‌ భావించిందని, తరవాత అది కార్యరూపం దాల్చలేదని సమాచారం. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net