close

తాజా వార్తలు

‘ఆనం.. దానిపై ఆధారాలేమైనా ఉన్నాయా?’

వైకాపా నేతలపై మండిపడిన కుటుంబరావు

అమరావతి: వైకాపా నేతలు తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు.  తెదేపా ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు చేసిందంటూ వైకాపా ఆరోపించిన నేపథ్యంలో అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.  9 నెలల్లో తీసుకోవాల్సిన  అప్పు కేవలం ఒక్క నెలలోనే తీసుకున్నట్టు ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారనీ.. దీనిపై ఆయన దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఈ నెలలోనే ఏపీ ప్రభుత్వం రూ. 40 వేల కోట్లు అప్పు చేసిందని విజయ సాయి రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఇలాంటి అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని వైకాపా నేతలకు కుటుంబరావు హితవు పలికారు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net