close

కథనాలు

ఎక్స్‌రే కళ్లు.. జాగ్రత్త

త్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థిని జయప్రదకు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఒకప్పటి సహ నాయకుడు, ప్రస్తుత సమాజ్‌వాదీ పార్టీ ప్రత్యర్థి ఆజంఖాన్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలకు ఈ నోటీసులు అందాయి. ‘‘ఆజంఖాన్‌ నామీద చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయనవి ఎక్స్‌రే కళ్లని తెలుస్తోంది. కాబట్టి మాయావతీ జీ.. ఆ కళ్లు పెట్టుకుని మీ వైపు కూడా ఎక్కడెక్కడ చూస్తారో, కాస్త జాగ్రత్తగా ఉండండి’’ అని జయప్రద అన్నారు. దీంతో ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారని కేసు నమోదైంది. గతంలో జయప్రద ధరించిన లోదుస్తుల రంగు గురించి వ్యాఖ్యానించినందుకు ఆజంఖాన్‌ మీద ఎన్నికల సంఘం 72 గంటల ప్రచార నిషేధం విధించింది.


మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net