close

తాజా వార్తలు

ఓటు హక్కు వినియోగించుకున్న మోదీ

అహ్మదాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ రనిప్‌లోని నిశన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అంతకుముందు గాంధీనగర్‌లోని తన మాతృమూర్తి నివాసానికి చేరుకున్న మోదీ..ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కూడా ఉన్నారు. ఓటు వేసిన అనంతరం మోదీ మీడియాతో మాట్లాడుతూ.. సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలాని ప్రజలకుపిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఎన్నికల పోలింగ్‌ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత  ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. గుజరాత్‌లోని 26 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net