close

తాజా వార్తలు

ఓటేసిన ప్రముఖులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక సమరంలో భాగంగా ప్రారంభమైన మూడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతోపాటు పలువురు నేతలు, ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 116 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్‌ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు తరలివస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ రనిప్‌లోని నిశన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.  అలాగే ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ అహ్మదాబాద్‌లోని రైజన్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటేశారు.

⇒ భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఆయన భార్యతో కలిసి అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. 

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఆయన సతీమణి అంజలితో కలిసి రాజ్‌కోట్‌లోని అనిల్‌ జ్ఞాన్‌ మందిర్‌ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ క్యూలైన్లో నిల్చుని పినరయి ఆర్సీ అమలా యూపీ స్కూల్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఆయన సతీమణితో కలిసి నార్త్‌ గోవా జిల్లాలోని పాలె పట్టణంలో ఓటు వేశారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఒడిశాలోని తాల్చేర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మాజీ ఐఏఎస్‌ అధికారి భువనేశ్వర్‌ భాజపా అభ్యర్థి అపరిజిత సారంగి నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ భువనేశ్వర్‌లో ఓటేశారు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net