close

తాజా వార్తలు

ఇప్పటివరకూ కేశాలకు కాపలాదారుణ్ని

ఇకపై దేశానికి..
భాజపాలో చేరిన జావెద్‌ హబీబ్‌

 

దిల్లీ: ప్రముఖ కేశాలంకరణ నిపుణుడు జావెద్‌ హబీబ్‌ సోమవారం దిల్లీలో భాజపాలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాజపాలో చేరుతుండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశానికి కాపలాదారుగా తనకు ప్రమోషన్‌ లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ తాను కేశాలకు మాత్రమే కాపలాదారుడిగా ఉన్నానని, భాజపాలో చేరికతో దేశానికి కాపలాదారుడిని కాబోతున్నట్లు పేర్కొన్నారు. మోదీ అవలంబిస్తున్న విధానాలతో దేశంలో ఉన్నత సంస్కరణలు జరిగాయని జావెద్‌ అన్నారు. తాను ఛాయ్‌వాలా అని ప్రధాని గర్వంగా చెప్పుకుంటారని, అలాగే తాను బార్బర్‌ అని చెప్పుకొనేందుకు ఏ మాత్రం సిగ్గుపడబోనని స్పష్టం చేశారు. 

కేశాలంకరణలో జావెద్‌ హబీబ్‌ ప్రపంచ స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సెలబ్రిటీలకు హెయిర్‌ స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. జావెద్‌ హబీబ్‌ పేరుతో దేశంలో 550 వరకూ గొలుసుకట్టు హెయిర్‌ సెలూన్లు ఉన్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల మధ్యలో జావెద్‌ హబీబ్‌ భాజపాలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net