close

తాజా వార్తలు

దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే: రాహుల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైన సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి ప్రత్యేక సందేశమిచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువకులు.. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయబోతున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. భారతీయులందరికీ న్యాయం జరగాలని కోరకునే వారు.. అందుకోసం విజ్ఞతతో ఓటేస్తారని బలంగా నమ్ముతున్నాను’’ అని ట్విటర్‌లో రాసుకొచ్చారు. అలాగే ఈ సందర్భంగా ఆయన ఓ లఘుచిత్రాన్ని కూడా పోస్ట్‌ చేశారు. దాన్ని అందరికీ షేర్‌ చేయాలని కోరారు.

ఆ చిత్రంలో యువత.. ‘‘మన ప్రభుత్వం, మన ఉపాధి ఏదీ మోసం కావొద్దు. దేశ భద్రత, సుస్థిర ఆర్థిక వ్యవస్థ, కేంద్ర సంస్థల స్వతంత్రత, ప్రజల మధ్య విభేదాల తొలగింపు, దేశ సమగ్రత కోసం పాటు పడే ప్రభుత్వానికే మన తొలి ఓటేద్దాం. మార్పు కోసం ఓటేద్దాం. న్యాయం కోసం ఓటేద్దాం’’ అంటూ సందేశం ఇవ్వడం గమనించవచ్చు. అమేఠీతో పాటు కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా రాహుల్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడో దశలో భాగంగా వయనాడ్‌ నియోజవర్గంలో ఈరోజు పోలింగ్‌ కొనసాగుతోంది.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net