close

తాజా వార్తలు

వీవీప్యాట్‌ మెషిన్‌లో పాము..!

భయాందోళనకు గురైన ఓటర్లు, అధికారులు

కన్నూర్‌: మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా కేరళలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కన్నూర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మయ్యిల్‌ కందక్కయ్‌లోని పోలింగ్‌ బూత్‌లో వీవీప్యాట్‌లో ఓ పాము దర్శనమిచ్చింది. దీంతో ఎన్నికల సిబ్బంది, ఓటర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఓ సందర్భంలో పోలింగ్‌కు కొంత సమయం అంతరాయం ఏర్పడింది. అనంతరం పామును వీవీప్యాట్‌ నుంచి తీసి అక్కడి నుంచి మరోచోట వదిలేసి పోలింగ్‌ను కొనసాగించారు. అయితే వీవీప్యాట్‌లోకి పాము ఎలా దూరిందన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో భాగంగా దేశంలోని 116 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్‌లో 26, కేరళలో 20, యూపీలో 10, ఛత్తీస్‌గఢ్‌లో 7, ఒడిశాలో 6, అసోంలో 4, బిహార్‌, పశ్చిమ బంగాల్‌లో 6 స్థానాల చొప్పున ఎన్నికలు జరుగుతున్నాయి.  మహారాష్ట్ర, కర్నాటకలో 14 స్థానాల చొప్పున, గోవా, త్రిపుర, దాద్రా నగర్‌ హవేలి, డామన్‌ డయ్యూ, త్రిపురల్లో ఒక్కో స్థానం చొప్పున మూడో విడతలో భాగంగా ఎన్నికలు జరుగుతున్నాయి.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net