close

తాజా వార్తలు

పోటీచేయకూడదని రాజ్యాంగంలో లేదు: ప్రజ్ఞా

ముంబయి: రాజకీయ కుట్రలో భాగంగానే తన నామినేషన్‌ను తిరస్కరించాలంటూ పిటిషన్‌ వేశారని భోపాల్‌ భాజపా అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ అన్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె కోర్టుకు తెలియజేశారు. ఆమెపై మాలెగావ్‌ పేలుళ్ల కేసు విచారణలో ఉన్నందువల్ల ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని కోరుతూ ఎన్‌ఐఏ న్యాయస్థానంలో అహ్మద్‌సయ్యద్‌ బిలాల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే తనకు ఇప్పటికే ఎన్‌ఐఏ కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని, ఆ పేలుళ్ల విషయంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆమె న్యాయస్థానానికి తెలియజేశారు. ఒక వ్యక్తిపై క్రిమినల్‌ కేసు ఏదైనా ఉంటే ఆ విషయాన్ని నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అఫిడవిట్‌లో పేర్కొనాలని, తాను అలానే చేసినట్లు ఆమె తెలిపారు. క్రిమినల్‌ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆమె తెలిపారు. ఇదే తరుణంలో పిటిషన్‌ విచారణలో భాగంగా ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న కేసుల వివరాలను బట్టి, ఆమె నామినేషన్‌ను అనుమతించాలా..తిరస్కరించాలా అనే నిర్ణయం పూర్తిగా ఈసీకే ఉంటుందని ఎన్‌ఐఏ న్యాయస్థానం స్పష్టం చేసింది. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net