close

తాజా వార్తలు

పోలింగ్‌ సమయంలో ఘర్షణ: ఒకరు మృతి

ముషీరాబాద్‌: దేశవ్యాప్తంగా మంగళవారం నిర్వహిస్తున్న మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముషీరాబాద్‌లోని భగవాన్‌గోలాలో ఒక పోలింగ్‌ స్టేషన్‌ బయట కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలకు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన పియారుల్‌ షేక్‌ను కత్తితో పొడిచి హతమార్చారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మరో సంఘటనలో దినాజ్‌పూర్‌కి చెందిన పోలింగ్‌ ఏజెంట్‌ బాబులాల్‌ ముర్ము తన ఇంటిలోనే విగత జీవుడై కనిపించారు. అయితే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ రెండు సంఘటనల్లో ఆయా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

17వ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. వీటిలో ఇప్పటికే రెండు దశలు పూర్తవగా, మూడో దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 11న మొదటి దశతో ప్రారంభమైన ఎన్నికలు మే 19న చివరి దశతో ముగియనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net