close

తాజా వార్తలు

ఈవీఎంపై తప్పుడు ఫిర్యాదు  

పోలీసుల అదుపులో నిందితుడు

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా దశలవారీగా నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఎన్నికలు కేరళలో మంగళవారం జరిగాయి. ఈ నేపథ్యంలో తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఒక పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎం, వీవీప్యాట్‌ సరిగా పనిచెయ్యటం లేదని ఒక యువకుడు పోలింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వీవీప్యాట్‌లో తన ఓటు రిజిస్టర్‌ కాలేదని చూపిస్తోందని తెలిపాడు. దీంతో పోలింగ్‌ కాసేపు నిలిచింది. అనంతరం రిటర్నింగ్‌ అధికారి, పోలింగ్‌ సిబ్బంది, పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో మరోసారి అతడితో నమూనా ఓటింగ్‌ నిర్వహించారు. అతడు చెప్పిన లోపాలేవీ అక్కడ లేవని నిర్ధారించుకున్న అధికారులు అతణ్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. 

17వ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు దశల వారీగా నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా ఈవీఎంలపై అనుమానాలు, సమస్యలు తలెత్తితే ఓటర్లు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న సమస్య నిజమైనదే అయితే అధికారులు యుద్ధప్రాతిపదికన దానిని పరిష్కరిస్తారు. అయితే తప్పుడు ఫిర్యాదులు చేసే వారిని అరికట్టడానికి కఠిన చర్యలకూ వారు వెనుకాడడం లేదు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net