close

తాజా వార్తలు

ఓ వైపు పోలింగ్‌.. మ‌రోవైపు నామినేష‌న్లు

దిల్లీకి రాజైనా.. 

ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి  గుజ‌రాత్ వ‌చ్చిన మోదీ..  గాంధీనగర్‌లో తన మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మోదీకి ఆమె మిఠాయి తినిపించారు.  అనంతరం అహ్మదాబాద్‌లోని రనిప్‌ పోలింగ్‌ కేంద్రంలో వ‌రుస‌లో నిల‌బ‌డి ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ అహ్మదాబాద్‌లోని రైజన్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటేశారు.

ఓట్ల తులాభారంలో హ్యాట్రిక్ నాదే..

తిరువనంతపురంలో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓటు వేసిన అనంత‌రం సిరా గుర్తును చూపుతున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి శశిధరూర్. శశిథరూర్ తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వరుసగా రెండు సార్లు విజ‌యం సాధించారు.

బ్యాటును వ‌దిలి క‌త్తినిప‌ట్టుకొని..

మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తూర్పు దిల్లీ భాజ‌పా అభ్య‌ర్థిగా మంగ‌ళవారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ర్యాలీలో  అభిమానులు బ‌హుక‌రించిన క‌త్తితో గౌతం గంభీర్. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా అర్వీంద‌ర్‌సింగ్ ల‌వ్లీ పోటీ చేస్తున్నారు.

ప్ర‌జాక్షేత్రంలో పంచ్ ప‌వ‌ర్ చూపిస్తా!

ద‌క్షిణ దిల్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం గాల్లోకి పంచ్‌లు విసురుతున్న బాక్సర్‌ విజేందర్ సింగ్. భాజ‌పా అభ్య‌ర్థిగా ఎంపీ ర‌మేశ్ బిదూరి పోటీలో ఉన్నారు.

గాంధీనగర్‌లో అమితానందమే

భాజ‌పా అధ్య‌క్షుడు, గాంధీనగర్ అభ్య‌ర్థి అమిత్‌షా అహ్మదాబాద్‌లో ఓటు వేసిన అనంత‌రం సిరా గుర్తును చూపుతున్న దృశ్యం. అహ్మదాబాద్‌లో అమిత్‌షా మ‌న‌వ‌రాలిని ఎత్తుకుని విజ‌య సంకేతం చూపుతున్న ప్ర‌ధాని మోదీ.

రాంపూర్‌లో గెలుపు జ‌య‌ప్ర‌దమేనా?

రాంపూర్‌లో ఓటు వేసేందుకు వ‌స్తూ ఓట‌ర్ల‌కు అభివాదం చేస్తున్న భాజ‌పా ఎంపీ అభ్య‌ర్థిని జ‌య‌ప్ర‌ద‌. ఓటు వేసిన అనంత‌రం విజ‌య సంకేతం చూపుతున్న దృశ్యం.

విజ‌య శంఖం పూరిస్తాం!

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ భువనేశ్వర్‌లో ఓటేశారు. ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాల‌తో పాటు వాటి ప‌రిధిలోని 42 శాసనసభ స్థానాలకు నేడు పోలింగ్‌ జ‌రిగింది.

స‌తీస‌మేతంగా..

రాజ్‌కోట్‌లో త‌న స‌తీమ‌ణి పూజ‌తో క‌లిసి ఓటు వేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఛెతేశ్వర్‌ పుజారా.

మ‌న గెలుపు దిగ్విజ‌యం కావాలి

నామినేష‌న్ సమర్పించడానికి ముందు నిర్వ‌హించిన బ‌హిరంగ సభా వేదిక‌పై భాజ‌పా జాతీయ ఉపాధ్య‌క్షుడు శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌తో మాట్లాడుతున్న భోపాల్‌ భాజపా ఎంపీ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకుర్‌.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net