close

తాజా వార్తలు

ఒక్క ఓటు..100 శాతం పోలింగ్..ఎలాగంటే?

జునాగఢ్: మూడో దశ సార్వత్రిక ఎన్నికలు..13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాల్లో పోలింగ్..కోట్ల సంఖ్యలో ఓటర్లు..కానీ ఎక్కడా వంద శాతం పోలింగ్ జరగలేదు. ఒకే ఒక్క పోలింగ్ బూత్ మాత్రం ఆ రికార్డు సృష్టించింది. అది కూడా ఒకే ఒక్క ఓటుతో. వివరాల్లోకి వెళితే..

దేశవ్యాప్తంగా జరుగుతోన్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఈసీ ఎన్నో చర్యలు జాగ్రత్తలు తీసుకుంటుంది. అంత హడావుడిలోనూ గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉండే ఒక్క ఓటరు భరత్‌దాస్‌ బాపు కోసం గిర్‌ అటవీ ప్రాంతంలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసింది. ఈసీ నిబద్ధతకు తగ్గట్టుగానే ఆ వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఒక్క ఓటు కోసం ప్రభుత్వం డబ్బు ఖర్చుపెట్టి పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేసింది. నేను ఓటేయడంతో ఇక్కడ 100 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే ప్రతి ప్రాంతంలో 100 శాతం పోలింగ్ జరగాలి. అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థిస్తున్నాను’ అని బాపు వెల్లడించారు. ఆయన జునాగఢ్‌లోని ప్రాచీన ఆలయంలో పూజారిగా పనిచేస్తారని సమాచారం. ఆయన గిర్ అటవీ ప్రాంత పరిధిలోని దనేజా అనే గ్రామంలో నివసిస్తున్నారు. అక్కడికి ఇతరుల ప్రవేశానికి అనుమతి లేదు.  మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net