close

తాజా వార్తలు

12 గంటల వరకు పోలింగ్‌ శాతం 25.13..

న్యూదిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం కొనసాగుతున్న ఆరో విడత ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్‌ మొత్తం కలిపి 25.13 శాతంగా నమోదైంది. బిహార్‌లో 20.70, హరియాణాలో 23.26, మధ్యప్రదేశ్‌లో 28.25, ఉత్తర్‌ప్రదేశ్‌లో 21.75, పశ్చిమ బెంగాల్‌లో38.26, ఝార్ఖండ్‌లో 31.27, దిల్లీలో 19.55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఆ లోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.

కాగా, మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు గానూ ఆరో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో బిహార్‌లోని 8, దిల్లీలోని 7, హరియాణాలోని 10, ఝార్ఖండ్‌లోని 4, మధ్యప్రదేశ్‌లోని 8, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 14, పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే సరిచేయడానికి నిపుణులను నియమించారు. దేశంలోని మొత్తం 543 స్థానాల్లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  
 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net