close

తాజా వార్తలు

3 గంటల వరకు పోలింగ్‌ శాతం 46.52..

న్యూదిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం కొనసాగుతున్న ఆరో విడత ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ 46.52 శాతంగా నమోదైంది. బిహార్‌లో 43.86, హరియాణాలో 47.57, మధ్యప్రదేశ్‌లో 48.53, ఉత్తర్‌ప్రదేశ్‌లో 40.96, పశ్చిమ బెంగాల్‌లో 63.09, ఝార్ఖండ్‌లో 54.09, దిల్లీలో 36.73 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మరో రెండు గంటల్లో పోలింగ్ సమయం ముగియనుంది. ఆ లోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు గానూ ఆరో దశలో ఎన్నికలు కొనసాగుతున్నాయి.

ఈ దశలో బిహార్‌లోని 8, దిల్లీలోని 7, హరియాణాలోని 10, ఝార్ఖండ్‌లోని 4, మధ్యప్రదేశ్‌లోని 8, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 14, పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశంలోని మొత్తం 543 స్థానాల్లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఆరోదశ పోలింగ్‌తో కలిపి నేటివరకు మొత్తం 483 నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగిస్తుంది. మిగిలిన 59 స్థానాలకు చివరి దశలో మే నెల 19న ఎన్నికలు నిర్వహణ ఉంటుంది. తమిళనాడులోని వెల్లూరు ఎన్నికలను ఈసీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net