close

తాజా వార్తలు

అదే నా అనుమానం: మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లను ప్రభావితం చేసేలా భాజపా ప్రభుత్వం.. కేంద్ర బలగాలను వినియోగిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బసంతిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నేను కేంద్ర బలగాలను అగౌరవపర్చను. కానీ, ఓటర్లను ప్రభావితం చేయాలని వారికి సూచనలు అందాయి. కేంద్ర బలగాల చాటున పశ్చిమ బెంగాల్‌లోకి భాజపా.. తమ కార్యకర్తలతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను ఇక్కడకు పంపుతోంది. భాజపా ప్రభుత్వం.. కేంద్ర బలగాల యూనిఫామ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను పంపిందని నా అనుమానం’ అని ‌వ్యాఖ్యానించారు.

‘ఘాటల్‌ నియోజక వర్గంలో భాజపా అభ్యర్థి భారతీ ఘోష్‌కు భద్రత కల్పిస్తున్నామన్న నెపంతో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తకు గాయాలయ్యాయి. ఈ రోజు పోలింగ్‌ కేంద్రం లోపల కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో మైనార్టీ వర్గానికి చెందిన ఓ సోదరుడికి కూడా గాయాలయ్యాయి. భాజపాకే ఓట్లు వేయాలని క్యూలో నిలబడ్డ ఓటర్లకు కేంద్ర బలగాలు చెబుతున్నాయి. ఆ బలగాలు ఇక్కడ చేసే పని ఇదేనా? ఈ రోజు వారు ప్రధాని మోదీ కింద పని చేస్తున్నారు. రేపు మరొకరి కింద పనిచేస్తారు. అప్పుడేం చేస్తారు?’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net