close

తాజా వార్తలు

నన్ను ఆపగలరేమో.. విజయాన్ని కాదు: అమిత్ ‌షా

కానింగ్‌ (పశ్చిమ బంగా): సార్వత్రిక ఎన్నికలు తుదిదశకు చేరుకున్న వేళ నేతలు తమ మాటల యుద్ధానికి మరింత పదును పెంచారు. పశ్చిమ బంగాలో ర్యాలీలు నిర్వహించకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకోగలరేమో కానీ భాజపా విజయాన్ని మాత్రం ఆపలేరని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విరుచుకుపడ్డారు. పశ్చిమ బంగాలోని జాయ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని కానింగ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్‌షా ఈ మేరకు మమతా బెనర్జీపై మాటల దాడికి దిగారు. ‘ఎవరైనా జై శ్రీరాం అని నినదిస్తే మమతా బెనర్జీకి కోపం వస్తుంది. ఈ రోజు ఇక్కడ ఇంతమంది ముందు నేను జై శ్రీరాం అని గట్టిగా అంటున్నాను. ధైర్యం ఉంటే నన్ను అరెస్టు చేసుకోవచ్చు. నేను మరో 24 గంటలు కోల్‌కతాలోనే ఉంటాను’ అంటూ మమతపై అమిత్‌షా ధ్వజమెత్తారు. పశ్చిమ బంగాలో ఓ ఎన్నికల ర్యాలీకి హాజరుకావాల్సిన ఉండగా, అమిత్‌షా ప్రయాణించిన విమానాన్ని బరైపూర్‌లో దిగేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ర్యాలీలు నిర్వహించకుండా ఆయనను ఆడ్డుకోగలరేమో కానీ భాజపా విజయాన్ని మాత్రం అడ్డుకోవడం ఎవరితరం కాదంటూ సవాల్‌విసిరారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net