close

తాజా వార్తలు

కమల్‌హాసన్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు  

దిల్లీ: నాథూరామ్‌ గాడ్సేను ఉద్దేశిస్తూ ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయం అధ్యక్షుడు కమల్‌ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా నేత అశ్విని ఉపాధ్యాయ్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కమల్‌ ప్రచారంలో పాల్గొనకుండా ఐదు రోజుల పాటు నిషేధం విధించాలని కోరారు. 

తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం జరిగిన ఓ ప్రచార ర్యాలీలో కమల్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది ఒక హిందువు. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే. అప్పటి నుంచే ఈ ఉగ్రవాదం ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్న కారణంగా నేను ఈ వ్యాఖ్యలు చేయట్లేదు. గాంధీ విగ్రహం ఎదుట నిలబడి ఈ మాటాలు మాట్లాడుతున్నాను’ అని కమల్‌ వ్యాఖ్యనించారు. అయితే దేశంలో ప్రజలంతా సమానత్వంలో జీవించాలని కోరుకునే భారతీయుల్లో తాను ఒకడినని చెప్పుకొచ్చారు. కమల్‌ వ్యాఖ్యలు తమిళనాటే గాక దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. హిందూ ఉగ్రవాదం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net