close

తాజా వార్తలు

ఆయనకు హత్య, ఉగ్రవాదానికి తేడా తెలీదు: సీతారామన్‌ 


దిల్లీ: రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం మక్కల్‌ నీది మయ్యుం పార్టీ అధినేత కమల్ హాసన్‌ మీద విరుచుకుపడ్డారు. హత్య, ఉగ్రవాదానికి ఉన్న తేడాను ఆయన అర్థం చేసుకోలేరని ఆమె మండిపడ్డారు. స్వతంత్ర భారత్‌లో ‘తొలి ఉగ్రవాది హిందువే’ అని ఎన్నికల ర్యాలీలో కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమె నుంచి ఈ స్పందన వచ్చింది.

 ‘ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్న కారణంగా నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. గాంధీ విగ్రహం ఎదుట నిలబడి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది ఒక హిందువు. ఆయన పేరు నాథూరామ్ గాడ్సే. అప్పటి నుంచే ఉగ్రవాదం ప్రారంభమైంది’ అని తమిళనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కమల్ హాసన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  దేశంలోని ప్రజలంతా సమానత్వంతో జీవించాలని కోరుకునే భారతీయుల్లో తానూ ఒకడినని అభిప్రాయపడ్డారు. అయితే కమల్ పై చర్యలు తీసుకోవాలంటూ భాజపా నేత అశ్విని ఉపాధ్యాయ్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన ప్రచారంలో పాల్గొనకుండా ఐదు రోజుల పాటు నిషేధం విధించాలని కోరారు. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net