close

తాజా వార్తలు

ఆమె సద్దాం హుస్సేన్‌లా ప్రవర్తిస్తున్నారు: ఒబెరాయ్‌


దిల్లీ: బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మీద విమర్శలు చేశారు. ఆమెను ఇరాక్‌ నియంత సద్దాం హుస్సేన్‌తో పోల్చుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీ భాజపా ప్రతినిధి తాజిందర్‌ పాల్ సింగ్ బగ్గాను కోల్‌కతాలోని హోటల్ గదిలో పోలీసులు అరెస్ట్ చేయడం, భాజపా యూత్ వింగ్ కన్వీనర్‌ ప్రియాంక శర్మను అదుపులో ఉంచడం వంటి ఘటనలను ఉద్దేశించి ఒబెరాయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 
‘అత్యంత గౌరవనీయమైన దీదీ ఎందుకు సద్దాం హుస్సేన్‌ వలే ప్రవర్తిస్తున్నారో నాకర్థం కావట్లేదు! దీదీ లాంటి నియంత పరిపాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. మొదట ప్రియాంక శర్మ, ఇప్పుడు తాజిందర్‌ బగ్గా. ఇక్కడ దీదీగిరి చెల్లుబాటు కాదు’ అని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ బెంగాల్ సేవ్ డెమోక్రసీ, ఫ్రీ తాజిందర్ బగ్గా అని హ్యాష్‌ ట్యాగ్‌లను జత చేశారు.  
ఒకవైపు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రోడ్ జరుగుతుండగా, హోటల్ గది నుంచి ఇతర పార్టీ నాయకులతో పాటు తనను అరెస్ట్ చేశారని బగ్గా వెల్లడించిన సంగతి తెలిసిందే.  సుప్రీం తనకు బెయిల్ ఇస్తూ తీర్పు ఇచ్చిన తరవాత కూడా 18 గంటలు అదుపులో ఉంచారని ప్రియాంక శర్మ ఆరోపించారు. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net