close

తాజా వార్తలు

కోల్‌కతా ఘర్షణకు నిరసనగా దీదీ పాదయాత్ర

కోల్‌కతా: భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా మంగళవారం కోల్‌కతాలో జరిగిన అల్లర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముగింపు దశలో ఉండటంతో భాజపా, టీఎంసీ నువ్వానేనా అన్నంత రీతిలో మాటల దాడికి దిగాయి. ఆ ఘర్షణలకు నిరసనగా బుధవారం మమత బేలియాఘాటా నుంచి శ్యామ్ బజార్ వరకు ఆరు కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో వేల సంఖ్యలో  టీఎంసీ కార్యకర్తలు, మద్దతు దారులు జెండాలు పట్టుకొని ఆమె వెంట నడిచారు. 
మంగళవారం అమిత్ షా ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఆయన వాహనం మీద కొందరు టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. దాంతో ఆగ్రహించిన  భాజపా కార్యకర్తలు వాహనాలను ధ్వంసం చేశారు. దాంతో బెంగాల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనపై రెండు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net