close

తాజా వార్తలు

బెంగాల్‌లో రేపటితో ప్రచారం ముగించండి: ఈసీ 

న్యూదిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం మొదటిసారి 324 అధికరణాన్ని ప్రయోగించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో గురువారం రాత్రి 10 గంటల నుంచే ఎన్నికల ప్రచారం ముగించాలని ఈసీ ఆదేశించింది. చివరి దశ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో 9 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈసీ నిర్ణయంతో ఈ తొమ్మిది నియోజక వర్గాల్లో రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ‘324 అధికరణాన్ని ప్రయోగించడం బహుశా ఇదే మొదటిసారి. విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం కావడం పట్ల ఈసీ ఆవేదనను వ్యక్తం చేస్తోంది. ఈ పనికి పాల్పడిన వారికి రాష్ట్ర అధికారులు గుర్తించి, అదుపులోకి తీసుకుంటారని భావిస్తున్నాము’ అని ఎన్నికల అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. చివరిదశ ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో ప్రచార గడువు శుక్రవారంతో ముగియనుంది. మే 19న ఎన్నికలు జరుగుతాయి.. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. ‌


 



Tags :

మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net