నా పేరు స్రవంతి. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. కొన్ని నెలల క్రితం ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. తన మాటలు నచ్చి తనతో స్నేహం కొనసాగిస్తున్నాను. కానీ మాట్లాడుతూ, మాట్లాడుతూ మధ్య మధ్యలో నన్ను తాకుతుంటాడు. చేతులు పట్టుకుంటాడు. భుజంపై చేయివేస్తాడు. అతని మాటల్లో మాత్రం ఎటువంటి చెడు ప్రవర్తన కనిపించదు. పద్దతిగానే మాట్లాడుతాడు. కానీ తను తాకుతుంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. తనని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ పరిచయం ఎటు దారితీస్తుందో తెలియక ఆందోళనగా ఉంది. నన్ను ఏం చేయమంటారు?