బిందాస్‌గా బతకడానికి..
చదువు ఒక్కటే కాదు..

మీ ఇష్టాలు, అభిరుచుల్ని వదలొద్ధు చదువు, ఉద్యోగం ఏం చేస్తున్నా.. కాస్త టైమ్ దొరికితే మీకిష్టమైన పుస్తకాలను చదవండి. వాటిలోని స్ఫూర్తిదాయక వాక్యాలను ఒకచోట రాసుకోండి. సమయం దొరికినప్పుడు వాటిని మళ్లీ మళ్లీ చదువుకోండి. శూన్యం మీ దరిచేరదు.
* రాయండి.. కవితలో, కథలో. ఆయా పాత్రల్లో ఎన్నో కోణాల్ని చూసే వీలుంటుంది. అప్పుడే మీ కథలో మీరో హీరో అవుతారు.
* మ్యూజిక్ ఇష్టమైతే ఫేవరెట్ పాటల్ని ప్లేలిస్ట్‌గా పెట్టుకోండి. మనసు బాగోనప్పుడు.. లెట్స్ ప్లే.
* స్నేహం.. ఓ వరం. అప్పుడప్పుడు హ్యాంగ్అవుట్స్ చేయండి. అక్కడే మీకు ఎదురయ్యే ఎన్నో హ్యాంగోవర్ ప్రశ్నలకు జవాబు దక్కుతుంది.- సినిమాలు చూడండి. చూసిన పాత్రల్ని విశ్లేషించండి. అప్పుడే మీదైన సినిమాలో మీరు సరైన పాత్రల్ని ఎంపిక చేసుకోగలగుతారు.
|