అవగాహన అవసరం
ఎంత స్మార్ట్ ఫోన్ అయినా అత్యుత్సాహానికి పోతే హ్యాకర్ వలకి కచ్చితంగా చిక్కుతారు. మీకొచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ ఏదైనా నిశితంగా పరిశీలించండి. దాంట్లో ఏవైనా లింక్‌లు ఉంటే గూగుల్‌లో వెతికి చూడండి. అవి అధికారికమైనవో కాదో చెక్ చేసుకోండి. నకిలీలను వెతికి పట్టే థర్డ్‌పార్టీ సర్వీసులూ నెట్టింట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో https:/heck4spam.com/ వెబ్ సర్వీసు ఒకటి. వాట్సప్‌లో వైరల్ అవుతున్నవాటిలో ఏవి నకిలీలో విభాగాల వారీగా వెతికి చూడొచ్చు. * ఆకట్టుకునేలా ప్రకటనలు ఏవైనా వస్తే వాస్తవ దృక్పథంతో ఆలోచించాలి. ఉదాహరణకు రూ.50,000 ఖరీదున్న ఫోన్‌ని కేవలం కూ.499కే ఇస్తున్నాం అంటే నమ్మొద్దు. అంత హైఎండ్ ఫోన్‌ని చౌకగా ఎలా అమ్మకానికి పెడతారనే స్పృహ ఉండాలి. * చికిత్స నిమిత్తం సాయం ఆశిస్తూ ఏదైనా మెసేజ్ వస్తే. దాంట్లోని నిజమెంతో తెలుసుకోండి. కాంటాక్ట్ వివరాల్లో ఎవ్వరూ స్పందించకుంటే మెసేజ్‌ని డిలీట్ చేయాలి తప్పితే మరొకరికి ఫార్వర్డ్ చేయొద్దు. * నకిలీ మెసేజ్ మీరు క్రియేట్ చేయనప్పటికీ ఎవరో క్రియేట్ చేసిన దాన్ని నమ్మి మీరూ ఇతరులతో పంచుకుంటే ఆ మోసంలో మీరూ భాగస్వాములవుతారని గుర్తుంచుకోవాలి.
- సీహెచ్‌ఏఎస్ మూర్తి, జాయింట్ డైరెక్టర్, సీ-డాక్
|