జూనియర్‌ అబ్దుల్‌ కలాం
close

తాజా వార్తలు

Published : 18/06/2021 22:20 IST

జూనియర్‌ అబ్దుల్‌ కలాం

ముంబయి: పుణెలోని తలెగావ్ దభాడేకు చెందిన 12 ఏళ్ల సోహమ్ సాగర్ పండిత్ అనే చిన్నారి తన ప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించాడు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్, స్పేస్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన స్పేస్ రీసెర్చ్ ఛాలెంజ్ 2021లో పాల్గొని అత్యంత తేలికైన శాటిలైట్ తయారుచేసి చరిత్ర సృష్టించాడు. 100 తేలికైన శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హీలియం బెలూన్ల సాయంతో 35-38 వేల మీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాలను లాంఛ్ చేశారు. అత్యంత తేలికైన శాటిలైట్‌ను రూపొందించిన సోహమ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని