జగిత్యాల వాసికి రూ.1.50కోట్ల వైద్య బిల్లు మాఫీ
close

తాజా వార్తలు

Published : 17/07/2020 01:48 IST

జగిత్యాల వాసికి రూ.1.50కోట్ల వైద్య బిల్లు మాఫీ

జగిత్యాల: కరోనా సోకిన జగిత్యాల జిల్లావాసికి చికిత్స నిర్వహించి రూ.1.50కోట్ల బిల్లును మాఫీ చేసి దుబాయ్‌ ఆస్పత్రి ఉదారతను చాటుకుంది. ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన గుల్లపల్లిమండలం పెనుగుముట్లకు చెందిన వడ్నాల రాజేశ్‌ కరోనా బారినపడి ఏప్రిల్‌ 23న దుబాయ్‌లోని ఆస్పత్రిలో చేరాడు. 80 రోజుల చికిత్సకు గానూ రూ.1కోటి 52 లక్షల బిల్లు వచ్చింది. భారీగా బిల్లు రావడంతో పలు ఎన్నారై సంఘాలు ఇండియా కాన్సులేట్‌ దృష్టికి తీసుకెళ్లాయి. కాన్సులేట్‌ విజ్ఞప్తితో దుబాయ్‌ ప్రభుత్వం బిల్లును మాఫీ చేయించి, విమాన టికెట్లు ఇప్పించి, ఖర్చులకు గానూ మరో రూ.10,000 అందించింది. ఈ నెల 12న స్వగ్రామం చేరుకున్న రాజేశ్‌ హోం క్వారంటైన్‌లో ఉన్నాడు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని