ఆక్సిజన్‌ బండి @ 25 వేల టన్నులు
close

తాజా వార్తలు

Published : 05/06/2021 23:20 IST

ఆక్సిజన్‌ బండి @ 25 వేల టన్నులు

దిల్లీ: గమ్య స్థానాలకు చేరుస్తూ దేశ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా విలువైన సేవలందిస్తున్న భారతీయ రైల్వే.. కొవిడ్‌ మహమ్మారి వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో రోగులకు అత్యవసరమైన ప్రాణవాయువును సరఫరా చేసే బాధ్యతను సైతం తలకెత్తుకుంది. ఎంతోమందికి ఊపిరి పోసిన రైల్వే.. తాజాగా ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 25,629 టన్నుల ద్రవరూప మెడికల్‌ ఆక్పిజన్‌ను సరఫరా చేసిన ఘనతను దక్కించుకుంది. కరోనా కాలంలో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 39 నగరాలకు 1500 పైగా ట్యాంకర్లలో ఆక్సిజన్‌ సరఫరా చేసినట్టు రైల్వే శనివారం వెల్లడించింది. ఇప్పటి వరకు 368 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు పలు రాష్ట్రాలకు ఆక్సిజన్‌ ట్యాంకర్లను చేరవేయగా.. మరో 482 టన్నుల ప్రాణవాయువును నింపుకొన్న 30 ట్యాంకర్లను గమ్య స్థానాలకు చేరవేసేందుకు ఏడు రైళ్లు పయనమైనట్లు తెలిపింది. 

ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా రైల్వే ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌కు 320, కర్ణాటకకు 3,097, మహారాష్ట్రకు 614, మధ్యప్రదేశ్‌కు 656, ఆంధ్రప్రదేశ్‌కు 2,602‌, రాజస్థాన్‌కు 98, తమిళనాడుకు 2,787, హరియాణాకు 2,212, తెలంగాణకు 2,474, పంజాబ్‌కు 225, కేరళకు 513, దిల్లీకి 5,790, ఉత్తర్‌ప్రదేశ్‌కు 3,797‌, ఝార్ఖండ్‌కు 38, అసోంకు 400 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసింది. భారతీయ రైల్వే పశ్చిమాన హపా, బరోడా, ముంద్రా; తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుంచి ఆక్సిజన్‌ను తీసుకొని, ఆపై దానిని ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, హరియాణా, తెలంగాణ, పంజాబ్‌, కేరళ, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, అసోం రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని