మారుతీ హోమ్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు: కమిషనర్‌

తాజా వార్తలు

Published : 14/08/2020 14:04 IST

మారుతీ హోమ్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు: కమిషనర్‌

హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని ప్రైవేటు అనాథ శరణాలయం (మారుతీ హోమ్‌)లో లైంగిక దాడికి గురైన  14 ఏళ్ల బాలిక మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 3 కేసులు నమోదయ్యాయని, మారుతీ హోమ్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు చేశామని మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ కమిషనర్‌ దివ్య తెలిపారు. అందులో ఉన్న 49 మంది పిల్లలను ప్రభుత్వ హోమ్‌లో చేర్పించామని వెల్లడించారు. 

ఘటనపై హై పవర్‌ కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ విచారణ కొనసాగుతోందని వివరించారు. ఈనెల 20వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించామన్నారు. ఏసీపీ స్థాయి అధికారితో కేసు దర్యాప్తు చేయించాలని డీజీపీని కోరామన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరింత సమాచారం వస్తుందన్నారు. అంగన్‌వాడీ టీచర్లు కూడా ప్రైవేట్‌ హోమ్‌లను పరిశీలించాలని సూచించామన్నారు. రాష్ట్రంలో ఉన్న 429 ప్రైవేటు హోమ్‌లలో 14వేల మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. జిల్లా పర్యవేక్షక కమిటీ తరచూ పర్యవేక్షిస్తున్నా.. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని కమిషనర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని