రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం

తాజా వార్తలు

Updated : 23/02/2021 16:19 IST

రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం నుంచి ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా తరగతులు ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అయితే తరగతులను రేపటి నుంచి మార్చి ఒకటో తేదీలోగా ప్రారంభించుకోవచ్చన్నారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే పాఠశాల స్థాయిలో 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌, పీజీ కోర్సుల్లోని విద్యార్థులందరికీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. అన్ని సంవత్సరాల విద్యార్థులకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తరగతులు మొదలయ్యాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని