జీఎస్టీ రుణాలు: మరో ₹6 వేల కోట్లు విడుదల

తాజా వార్తలు

Published : 19/01/2021 00:08 IST

జీఎస్టీ రుణాలు: మరో ₹6 వేల కోట్లు విడుదల

దిల్లీ: జీఎస్టీ పరిహారం కింద మరో దఫా రాష్ట్రాలకు కేంద్రం రుణాలు విడుదల చేసింది. 12వ విడతగా రూ.6వేల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు విడుదల చేసిన రుణ మొత్తం రూ.72వేల కోట్లకు చేరింది. ఇప్పటి వరకు విడుదల చేసిన రుణాల్లో ఏపీకి రూ.1648.89 కోట్లు, తెలంగాణకు రూ.1206.87 కోట్లు దక్కాయి. జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన రూ.1.10 లక్షల కోట్ల లోటును భర్తీ చేసేందుకు స్పెషల్‌ బారోయింగ్‌ విండోను కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా అక్టోబర్‌ నుంచి విడతల వారీగా రాష్ట్రాలకు కేంద్రం రుణాలను విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు 65 శాతం రుణ పంపిణీ పూర్తయినట్లు తెలిపింది.

ఇవీ చదవండి..
రేపు కాళేశ్వరం పర్యటనకు సీఎం కేసీఆర్‌
రేపు దిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని