ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు గుడి

తాజా వార్తలు

Updated : 06/08/2020 13:21 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు గుడి

గోపాలపురం: పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెం వైకాపా నాయకులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేరిట ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ఆటంకం కలిగిస్తున్నప్పటికీ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఆయన తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను ఇతర రాష్ట్రాల నాయకులు స్వాగతిస్తున్నారని చెప్పారు. పార్టీ నేతల సహకారంతో ఆలయం నిర్మించి, అందులో జగన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని