ఏపీ ఎస్‌ఈసీతో సీఎస్‌ నీలం సాహ్ని భేటీ

తాజా వార్తలు

Updated : 28/10/2020 16:26 IST

ఏపీ ఎస్‌ఈసీతో సీఎస్‌ నీలం సాహ్ని భేటీ

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని సమావేశయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని ఎస్‌ఈసీ కోరిన నేపథ్యంలో సీఎస్‌ ఆయనతో భేటీ అయ్యారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తే రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖల అధికారులతో ఎస్‌ఈసీ సమావేశమై రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై చర్చించారు.

ఈ ఉదయం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన ఎస్‌ఈసీ.. స్థానిక ఎన్నికలపై వారి అభిప్రాయం తెలుసుకున్నారు. సంప్రదింపుల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం గొప్పగా భావిస్తోందని రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం ఎస్‌ఈసీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పాలని కోరారు.

ఇదీ చదవండి..

ఏపీలో స్థానిక ఎన్నికలపై అభిప్రాయ సేకరణ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని