బిల్లులపై ఏపీ గవర్నర్‌ న్యాయ సలహా

తాజా వార్తలు

Published : 24/07/2020 16:30 IST

బిల్లులపై ఏపీ గవర్నర్‌ న్యాయ సలహా

అమరావతి: పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ న్యాయసలహాలు తీసుకుంటున్నారు. రాజ్‌భవన్‌ అధికారులు, సీనియర్‌ న్యాయవాదులతో ఆయన సమావేశమై.. అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. చర్చల అనంతరం బిల్లులపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు.

గత నెల 17న శాసనసభ నుంచి రెండోసారి ఈ బిల్లులను శాసనమండలికి పంపారు. ఆ రోజు బిల్లులను ప్రవేశపెట్టకముందే మండలి నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ నుంచి రెండోసారి మండలికి పంపినందున అక్కడ చర్చ, ఆమోదాలతో సంబంధం లేకుండా నెల రోజులకు స్వయంచాలితంగానే (ఆటోమేటిక్‌) ఆమోదం పొందినట్లు పరిగణిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. గత నెల 17న మండలికి పంపిన ఈ బిల్లులకు ఈనెల 17తో ఈ వ్యవధి ముగిసిందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్లే తుది ఆమోదానికి గవర్నర్‌కు శనివారం పంపినట్లు చెబుతున్నారు. గత జనవరిలో తొలిసారి బిల్లులను శాసనసభలో ఆమోదించి మండలికి పంపారు. వీటిని మండలి ఛైర్మన్‌ అప్పట్లో సెలక్టు కమిటీకి పంపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని