గనుల లీజు రద్దు ఉత్తర్వులు కొట్టేసిన హైకోర్టు

తాజా వార్తలు

Published : 28/08/2020 00:51 IST

గనుల లీజు రద్దు ఉత్తర్వులు కొట్టేసిన హైకోర్టు

అమరావతి: గనుల లీజు రద్దు వ్యవహారంలో ప్రకాశం జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు ఊరట లభించింది. గనుల లీజును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. తమ గనుల లీజును మైనింగ్‌ శాఖ రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ గొట్టిపాటి రవి, పోతుల రామారావు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.

మార్చి నెలలో ఇరువురి గనులకు సంబంధించి మైనింగ్‌ అధికారులు డిమాండ్‌ నోటీసులు పంపారు. దీనిపై గతంలోనే బాధితులు హైకోర్టును ఆశ్రయించగా.. డిమాండ్‌ నోటీసులు ఇచ్చిన కేసులో న్యాయస్థానం స్టే విధించింది. ఆ తర్వాత గనుల లీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని.. డిమాండ్‌ నోటీసుపై స్టే ఉండగా లీజు ఎలా రద్దు చేస్తారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. గనుల లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని