‘రమేశ్‌ ఆస్పత్రి ఎండీపై చర్యలు నిలిపివేయండి’

తాజా వార్తలు

Updated : 25/08/2020 15:21 IST

‘రమేశ్‌ ఆస్పత్రి ఎండీపై చర్యలు నిలిపివేయండి’

ఏపీ హైకోర్టు ఆదేశం

అమరావతి: విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం వ్యవహారంలో రమేశ్‌ ఆస్పత్రి ఎండీ, ఛైర్మన్‌పై తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అగ్నిప్రమాదం నేపథ్యంలో తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఆస్పత్రి ఎండీ రమేశ్‌బాబు, సీతారామ్మోహన్‌రావు వేర్వేరుగా క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

స్వర్ణప్యాలెస్‌లో రమేశ్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహించారు. ఈనెల 9న అక్కడ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన ప్రభుత్వం రమేశ్‌ ఆస్పత్రికి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అనుమతులు రద్దుచేసి ఎండీ డాక్టర్‌ రమేశ్‌ బాబు సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో రమేశ్‌బాబు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఏళ్లతరబడి స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. అధికారులు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహణకు అనుమతి ఇచ్చారని పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. అనుమతులిచ్చిన అధికారులు కూడా ప్రమాదానికి బాధ్యులే కదా! అని వ్యాఖ్యానించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని తెలిపారు. ఇరువురు వాదనలు విన్న అనంతరం డాక్టర్‌ రమేశ్‌బాబు, సీతారామ్మోహన్‌రావుపై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని