వివేకా కేసు రికార్డులు సీబీఐకి అప్పగించండి

తాజా వార్తలు

Updated : 11/11/2020 17:31 IST

వివేకా కేసు రికార్డులు సీబీఐకి అప్పగించండి

పులివెందుల మెజిస్ట్రేట్‌ను ఆదేశించిన ఏపీ హైకోర్టు

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రికార్డులను సీబీఐకి అప్పగించాలని పులివెందుల మెజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో అనుమానితులను ప్రశ్నించిన సీబీఐ.. స్థానికంగా దర్యాప్తు చేసిన పోలీసులను సైతం విచారించింది. ఈ క్రమంలో పులివెందుల కోర్టులో ఉన్న రికార్డులు పరిశీలిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని సీబీఐ అధికారులు భావించారు. ఆ రికార్డులు తమకు అందించాలని కోరుతూ పులివెందుల కోర్టులు పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయస్థానం నిరాకరించింది.

దీంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. వివేకా హత్య కేసు రికార్డులను తమకు అప్పగించేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్‌ వేసింది. ఈ అంశంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసును త్వరగా దర్యాప్తు చేయడానికి రికార్డుల్లోని అంశాలు ఉపయోగపడతాయని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. కేసు రికార్డులను సీబీఐకి అప్పగించాలంటూ పులివెందుల మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని