విద్యార్థులకు కరోనా: స్పందించిన ఏపీ మంత్రి

తాజా వార్తలు

Published : 03/10/2020 20:11 IST

విద్యార్థులకు కరోనా: స్పందించిన ఏపీ మంత్రి

మెరుగైన వైద్యం అందించాలని విజయనగరం కలెక్టర్‌కు ఆదేశాలు

అమరావతి: విజయనగరం జిల్లా గంట్యాడలో 20 మంది విద్యార్థులకు కరోనాపై ఆంధ్రప్రదేశ్‌ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌తో మంత్రి నాని ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే 20 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని చెప్పారు. లక్షణాలు లేకపోతే విద్యార్థులను హోంక్వారంటైన్‌లో ఉంచాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై రోజూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు. వైద్య కిట్లు అందజేయాలని జిల్లా వైద్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్లు వినియోగించేలా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. 

గంట్యాడ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా సోకింది. పాఠశాలలోని 9,10 తరగతుల విద్యార్థులకు గత నెల 30న కరోనా పరీక్షలు నిర్వహించారు. గంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది విద్యార్థులకు పరీక్షలు చేశారు. పరీక్షలు నిర్వహించిన విద్యార్థుల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. సమాచారాన్ని డీఈవో నాగమణికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.

ఇదీ చదవండి: ఏపీలో కొత్తగా 6,224 కరోనా కేసులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని