ఏపీలో అత్యధికంగా కరోనా పరీక్షలు: ఆళ్ల నాని

తాజా వార్తలు

Published : 05/08/2020 17:41 IST

ఏపీలో అత్యధికంగా కరోనా పరీక్షలు: ఆళ్ల నాని

కడపలో కరోనా నివారణపై ఏపీ మంత్రి సమీక్ష

కడప: రాష్ట్రంలో కొవిడ్ నివారణ కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా అత్యధిక కరోనా పరీక్షలను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. కడప జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యలకు సంబంధించి జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై కలెక్టరేట్‌లో మంత్రి ఆళ్లనాని సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, వైకాపా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని కొవిడ్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ వ్యక్తులతో మంత్రి ఆళ్లనాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలు, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...

రాష్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. కొవిడ్‌ చికిత్సకు అవసరమైన  మందులు, వైద్య సదుపాయాలు సమకూరుస్తున్నట్లు చెప్పారు. కడప జిల్లాలో రోజుకు సగటున 4 వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1,080 ఆక్సిజన్ బెడ్లకు అదనంగా మరో 300 బెడ్లు పెంచుతున్నట్లు మంత్రి ఆళ్ల తెలిపారు. వారం రోజుల్లో జిల్లా కొవిడ్‌ కేర్ ఆసుపత్రుల్లో పనిచేయడానికి కావాల్సిన వెయ్యి మంది వైద్యులు, నర్సులు, సిబ్బందిని నియమించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన రోగులెవ్వరూ భయపడొద్దని.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి ఆళ్ల నాని భరోసా ఇచ్చారు. 
 

విశాఖ జిల్లాలో కరోనా నియంత్రణపై అవంతి సమీక్ష
విశాఖపట్నం జిల్లాలో కరోనా నియంత్రణపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ సమీక్షించారు. వైద్య సేవల కొరత లేకుండా వైద్యులు, సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ మనోస్థైర్యం దెబ్బతినకుండా చూడాలని చెప్పారు. రోగుల ఆరోగ్య పరిస్థితిపై బంధువులు ఆందోళన చెందుతున్నారని, రోగుల వివరాలు, వారి బంధువుల ఫోన్‌ నెంబర్లు తీసుకోవాలని మంత్రి అవంతి పేర్కొన్నారు. 

మంత్రి బాలినేనికి కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి కరోనా సోకింది. తనకు కరోనా వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని