ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ

తాజా వార్తలు

Updated : 24/11/2020 10:40 IST

ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ

అమరావతి: ఏపీ సీఎస్‌ నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మరో లేఖ రాశారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. రాజ్యాంగబద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని.. ఎన్నికల నిర్వహణ, కమిషన్‌ విధి నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని ఎస్‌ఈసీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎస్‌కు నిమ్మగడ్డ ఇదే విషయంపై లేఖ రాసి హైకోర్టు ఆదేశాల ప్రతిని దానికి జత చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని