స్పీకర్‌ తమ్మినేనికి తృటిలో తప్పిన ప్రమాదం

తాజా వార్తలు

Published : 22/11/2020 01:37 IST

స్పీకర్‌ తమ్మినేనికి తృటిలో తప్పిన ప్రమాదం

ఆమదాలవలస: ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేనికి తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వంజంగి గ్రామం వద్ద ఆటోను తప్పించబోయి కారు కాల్వలోకి దూసుకెళ్లింది. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీతారాం ఆమదాలవలసకు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అడ్డురావడంతో దానిని తప్పించడానికి డ్రైవర్‌ కారును పక్కకు తీశాడు. దీంతో వాహనం సమీపంలో పంట కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవర్‌ చాకచక్యంగా వాహనాన్ని అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం తమ్మినేని సీతారాం మరో వాహనంలో ఆమదాలవలసలోని స్వగృహానికి చేరుకున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని