ఆంగ్ల మాధ్యమం పిటిషన్‌పై విచారణ వాయిదా

తాజా వార్తలు

Published : 13/10/2020 13:18 IST

ఆంగ్ల మాధ్యమం పిటిషన్‌పై విచారణ వాయిదా

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ్ల మాధ్యమం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 

ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బొబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. దసరా సెలవుల తర్వాత విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని