పులి.. ఏనుగు.. మజుందార్‌ ట్వీట్‌

తాజా వార్తలు

Published : 21/12/2020 23:46 IST

పులి.. ఏనుగు.. మజుందార్‌ ట్వీట్‌

బెంగళూరు: సాధారణంగా వ్యాపారవేత్తలు తమ తమ పనుల్లో బిజిబిజీగా గడుపుతుంటారు. కానీ.. ఇటీవల వారంతా సామాజిక మాధ్యమంలో ఎంతో చురుగ్గా ఉంటున్నారు. తమ దృష్టికి వచ్చిన అద్భుత విషయాలు, వీడియోలను వెంటనే నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇటీవల మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్‌ మహీంద్రా.. ఓ ఏనుగు, పులి థ్రిల్లింగ్‌ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.

తాజాగా.. బయోకాన్‌ సంస్థ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌-షా.. 52 సెకన్ల నిడివి గల ఓ అద్భుత వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఇందులో ఓ పులి తన స్నేహితులతో కలిసి నీరు తాగేందుకు కొలను దగ్గరకు వచ్చింది. ముందుగా ఓ పులి దాహం తీర్చుకొని, తర్వాత తన మిత్రుల దాహం తీరేంత వరకు కాపాలా కాసింది. అనంతర మూడూ కలిసి వెళ్లిపోయాయి. ఇదంతా కర్ణాటకలోని నాగర్‌హోల్ అభయారణ్యంలో చోటు చేసుకుంది.  ఈ వీడియోకు "కొలను వద్ద పులులు.. ఆ ధీశాలి వ్యాఘ్రం అందానికి ఏదీ సరిపోదు" అనే కామెంట్‌ను ఆమె జత చేశారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని