మస్క్‌ సార్‌.. మీరే వచ్చి చూడండి

తాజా వార్తలు

Published : 04/08/2020 00:53 IST

మస్క్‌ సార్‌.. మీరే వచ్చి చూడండి

ఎలాన్‌ మస్క్‌కు ఆహ్వానం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతి ముఖ్యమైన విషయాలను గురించి సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌కు పరిపాటి.  కరోనా వైరస్‌ గురించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని గతంలో ఆయన చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమయింది. కాగా ఈయన ఇటీవల చేసిన ఓ ట్వీట్‌కు స్పందనగా.. ప్రపంచ ప్రఖ్యాత పిరమిడ్లను దర్శించాలని అనూహ్య ఆహ్వానం అందింది. వివరాలు ఇలా ఉన్నాయి...

49 ఏళ్ల సాంకేతిక దిగ్గజం మస్క్‌ హాస్యానికో, నిజంగా అవగాహన లేకనో గాని.. ‘‘పిరమిడ్లను గ్రహాంతర వాసులు నిర్మించారు...’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ గొప్ప నిర్మాణాలు 3800 సంవత్సరాల నాటివని కూడా అయన అన్నారు. మూడు రోజుల క్రితం షేర్‌ చేసిన ఈ ట్వీట్‌కు 5.4 లక్షలకు పైగా లైక్‌లు, పలు రీట్వీట్‌లు లభించాయి. ఈ వ్యవహారంపై ఈజిప్టు  మంత్రి రనియా అల్‌ మషత్‌ స్పందించారు. తమ దేశానికి వచ్చి, పిరమిడ్లను నిర్మాతల సమాధులను చూసి విషయాన్ని రూఢి చేసుకోవాల్సిందిగా ఆమె మస్క్‌ను కోరారు. అయితే హాస్యానికైనా సరే, ఎలాన్‌ మస్క్‌ ఈ విధంగా వ్యాఖ్యానించడాన్ని పలువురు తప్పుపట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని