రైతుల ఆశలపై నివర్‌ పిడుగు

తాజా వార్తలు

Published : 29/11/2020 10:45 IST

రైతుల ఆశలపై నివర్‌ పిడుగు

తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన రాయలసీమ రైతులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యాన సాగులో దూసుకెళుతున్న రాయలసీమ రైతులను నివర్‌ తుఫాను నట్టేట ముంచింది. లక్షల రూపాయల పెట్టుబడి కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోయింది. తెగుళ్ల నుంచి పంటను కాపాడుకుంటూ వస్తుంటే తుఫాను తుడిచిపెట్టేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాపై నివర్‌ తీవ్ర ప్రభావం చూపింది. తంబళ్లపల్లి పోతలపట్టు ప్రాంతాల్లో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉద్యాన సాగును దెబ్బతీసింది. అరటితోటలు నేలకొరిగాయి. పసుపు, తమలపాకు, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

అనంతపురం జిల్లాలో మిరప రైతులను వరద నిండా ముంచింది. కదిరి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పరిశీలించారు. పుట్లూరు మండలంలో పప్పు శెనగ, కంది, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతన్నలు బోరుమంటున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పల్లిపాలెంలో ముంపు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన కోవూరు ఎమ్మెల్యే వరదలో చిక్కుకుపోయారు. స్థానిక మత్స్యకారులు అతికష్టంమీద ఆయన్ను ఒడ్డుకు చేర్చారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని