close

తాజా వార్తలు

Published : 06/12/2020 02:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వధువుకు కరోనా..పెళ్లి ఎలా జరిగిందంటే?

నెట్టింట్లో వైరల్‌గా మారిన చిత్రాలు

(చిత్రాలు: జెస్సికా ఇన్‌స్టాగ్రాం ఖాతా నుంచి)

వాషింగ్టన్‌: పాట్రిక్‌ డిల్‌గాడో, లారెన్‌ జిమెనెజ్‌.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన జంట. నాలుగేళ్ల పరిచయాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలనుకున్నారు. గత ఏడాది మేలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే, పెళ్లికి తీసుకున్న కాస్త విరామం..కరోనా వైరస్ రూపంలో మరింత పెరిగింది. దాంతో మూడు సార్లు వారి పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడ్డాయి. చివరికి ఎలాగోలా నవంబర్‌ 20న వివాహానికి ముహూర్తం కుదిరింది. అప్పుడే అసలు ట్విస్ట్ ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

నవంబర్ 20న వివాహ బంధంతో పాట్రిక్‌, లారెన్‌ను ఒక్కటి చేయాలని పెద్దలంతా నిర్ణయించుకున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే రిపోర్టుల్లో పెళ్లి కుమార్తె లారెన్‌కు కరోనా అని తేలింది. అప్పటికే వారి వివాహం మూడు సార్లు కరోనా కారణంగా వాయిదా పడగా..ఈ సారి ఏకంగా పెళ్లి కుమార్తె ఈ మహమ్మారి బారిన పడటంతో ఇంట్లో వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు. మరోపక్క తర్వాతి రోజే వారి వివాహ లైసెన్స్‌ గడువు కూడా ముగియనుంది. దాంతో ఈసారి ఎలాగైనా పెళ్లిని వాయిదా వేయకూడదని నిశ్చయించుకున్న జంట..ఓ నిర్ణయానికి వచ్చారు. కరోనా నిబంధనలు, పెళ్లి సంప్రదాయాలను పాటిస్తూ ఈ వేడుకను కానిద్దామంటూ పెద్దలను ఒప్పించారు. అప్పటికే క్వారంటైన్‌లో ఉంటున్న లారెన్‌ ఇంటి బయటే వివాహానికి సిద్ధం చేశారు. బంధువులంతా భౌతిక దూరం పాటించారు. వధువు మొదటి అంతస్తులోని కిటికీ దగ్గర ఉండగా..వరుడు సరిగ్గా దాని కింద ఆరుబయట నిలబడ్డాడు. పెళ్లి ప్రమాణాల సమయంలో చేతులు పట్టుకోవడం కుదరదు కాబట్టి, అందంగా అలంకరించిన రిబ్బన్‌ను ఇద్దరు పట్టుకొనే ఏర్పాటు చేశారు. అలా వారిద్దరు తమ నాలుగేళ్ల ఎదరుచూపునకు ముగింపు పలుకుతూ, వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అతిథులంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ..కొత్త పద్ధతికి తెరతీసిన ఈ జంటను ఆశీర్వదించారు. అలాగే నెటిఫ్లిక్స్‌లో సినిమా చూస్తూ విందారగించారు. ‘కొవిడ్-19 సమయంలో నేను షూట్ చేసిన 2020 వెరైటీ వివాహం ఇది’ అంటూ జెస్సికా జాక్సన్ అనే  ఫొటోగ్రాఫర్ షేర్ చేసిన చిత్రాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ జంట తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఇవీ చదవండి..

మహమ్మారి ముగింపుపై కలలు కనొచ్చు: WHO

టీకా తప్పనిసరేం కాదు :బైడెన్‌


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని